తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి రీసెంట్ గానే వెట్రికజగం అనే పార్టీని స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఆయన చివరి సినిమా తీసి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోతానని, సినిమాలకు గుడ్ బై చెబుతానని ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ దళపతి తన 60వ  సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయ్యాక రాజకీయాల్లోకి వచ్చేస్తానని చెప్పారు. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆయన సొంతంగా అభ్యర్థులను నిలబెట్టి తమిళనాడులో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా త్రిష మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ దళపతి రాజకీయ పార్టీ స్థాపించిన వేళ త్రిష మాటలు తమిళనాడు రాజకీయాల్లో హీట్ పెంచేసాయి. మరి ఇంతకీ త్రిష ఏం మాట్లాడిందయ్యా అంటే.. నాకు సీఎం కావాలి అని బలమైన కోరిక ఉంది అంటూ త్రిష మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 ఇక అసలు విషయంలోకి వెళ్తే..త్రిష త్వరలోనే విడాముయర్చి సినిమాతో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో హీరోగా అజిత్ నటించారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. నాకు ఉన్న బలమైన కోరిక తమిళనాడు సీఎం అవ్వడమే. సమాజంలో మార్పులు రావాలంటే ప్రజాసేవ చేయడంతో పాటు రాజకీయాల వల్ల సాధ్యమవుతుంది. అందుకే నేను సీఎం అవ్వాలి అని కోరుకుంటున్నాను.అదే నా బలమైన కోరిక అంటూ త్రిష మాట్లాడడం ప్రస్తుతం తమిళనాడులో రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే రీసెంట్ గానే విజయ్ దళపతి పార్టీ స్థాపించడం, త్రిష సీఎం అవ్వాలని కోరిక ఉంది అనే విషయాన్ని బయట పెట్టడం షాకింగ్ గా అనిపిస్తుంది.

ఇక వీరిద్దరి మధ్య లింక్ ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిష మాట్లాడిన మాటలు వైరల్ గా మారడంతో విజయ్ తలపతి పెట్టిన పార్టీ సక్సెస్ అయ్యి తమిళనాడులో ఈయన పార్టీ గనుక గెలిస్తే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు త్రిష తీసుకుంటుంది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. అంతేకాదు సీఎం అవ్వాలని త్రిష అనడానికి కారణం కూడా అదేనని, విజయ గెలిస్తే సీఎం పదవి త్రిషదేనా అంటూ తమిళ ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ త్రిష మాట్లాడిన మాటలు మాత్రం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హీట్ పుట్టించాయి

మరింత సమాచారం తెలుసుకోండి: