సల్మాన్ ఖాన్‌తో రామ్ చరణ్‌కు మంచి అనుబంధం ఉంది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మంచి స్నేహితులు. అందుకే "గేమ్ ఛేంజర్" ప్రమోషన్స్‌కు సల్మాన్ ఖాన్ వెంటనే అంగీకరించినట్లు తెలుస్తోంది. వీకెండ్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీ కనిపించనున్నారు. బిగ్ బాస్ లాంటి పాపులర్ షోలో ప్రమోషన్స్ చేయడం వల్ల సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారు.
తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమోలో రామ్ చరణ్, కియారా అద్వానీ బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తో కలిసి డమ్ చార్డ్స్, రోప్ ఫైట్ వంటి గేమ్స్ ఆడుతూ కనిపించారు. కంటెస్టెంట్స్‌తో కలిసి చరణ్, కియారా ఆటలు ఆడటం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తోంది. "గేమ్ ఛేంజర్" ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ దూకుడు చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, జనవరి 11 నుంచి 23 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర సాధారణ ధర కంటే రూ.175 అధికంగా ఉంటుంది. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర రూ. 135 వరకు పెంచుకోవచ్చు. ఈ సమయంలో థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించడానికి అనుమతి లభించింది. ఇకజనవరి 10న అభిమానులకు పండుగలాంటి రోజు. ఆ రోజు తెల్లవారుజామున 1:00 గంటలకు ప్రత్యేక బెనిఫిట్ షో వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 600గా నిర్ణయించారు. అదే రోజు ఉదయం 4:00 గంటల నుండి ఆరు షోలు వేసుకోవడానికి అనుమతి లభించింది. ఈ షోలకు కూడా పండుగ సందర్భంగా పెంచిన టికెట్ ధరలు వర్తిస్తాయి.