సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు ఏ విషయం నైనా సరే డిస్కస్ చేయడం .. ఓపెన్ గా చెప్పడం .. ఆ ఇష్యూపై స్పందించడం బాగా అలవాటుగా మార్చేసుకున్నారు. కేవలం స్టార్ సెలబ్రిటీసే కాదు సామాన్య జనాలు కూడా స్టార్స్ విషయంలో ఓపెన్ గా స్పందించడం హైలైట్ గా మారుతూ వచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతూ వస్తుంది . దానికి కారణం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలే . బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన సినిమా "గేమ్ చేంజర్".


"గేమ్ చేంజర్" సినిమా జనవరి 10వ తేదీ రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు . కాక ఇదే మూమెంట్లో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.." రాజకీయాలు చేసే వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకూడదు అని ..సినిమాలో నటిస్తేనే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అని ..సినిమాలో నటించడం రాని వాళ్ళు సినిమాకి సంబంధం లేని వాళ్ళు కూడా సినిమా సభ్యులపై మాట్లాడడం సమంజసం కాదు అనే రేంజ్ లో కూసింత ఘాటుగానే స్పందించారు . దీంతో అక్కడే పవన్ అడ్డంగా దొరికిపోయినట్లు అయింది .



ఒకవేళ పవన్ మాట్లాడిన మాటలు నిజం అనుకుంటే ..? మరి సినిమాల్లో నటించే వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడొచ్చా..? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పెద్ద హీరో..? మరి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా ..? రాజకీయాల గురించి మాట్లాడొచ్చా..? అని ఎవరైనా ప్రశ్నిస్తే ..పవన్ కళ్యాణ్  ఏం సమాధానం చెప్తాడు ..? అంటూ యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు "మూలాలు మర్చిపోకూడదు" అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పదే పదే బన్నీని ఉద్దేశించినవి అంటూ గుర్తు చేస్తున్నారు. " అంతేకాకుండా హీరోలతో దండాలు పెట్టించుకునే వ్యక్తులం మేము కాదు" అంటూ పరోక్షకంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా ఇచ్చి పడేసాడు అని కూడా ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు . ఏమో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ఎంత రాంగ్ ఉంది అనే విషయం ఎవరికీ తెలియనప్పటికీ .. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో పెద్ద తప్పుడు అర్థం తీసుకొస్తున్నారు.  కానీ జనాలు మాత్రం ఆ విషయాని పెద్దగా పట్టించుకోవడం లేదు . పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీగా పాలిటిక్స్ చేస్తున్నారు అని .. అదే విధంగా సినిమాలకి న్యాయం చేస్తున్నాడు అంటూ ఆయనలాంటి నాయకుడే కావాలి అంటూ పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: