హిందీ లో అనేక సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మృణాల్ ఠాగూర్ ఒకరు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా తెలుగులో బ్లాక్ బాస్టర్ అయిన జెర్సీ సినిమాను హిందీలో అదే పేరుతో రీమిక్ చేశారు. ఆ సినిమాలో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈమె సీత రామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమెకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది.

అలాగే ఈ సినిమాలో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈమెకు నటిగా కూడా సూపర్ సాలిడ్ గుర్తింపు సీత రామం మూవీ ద్వారా వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో కూడా ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే కొంత కాలం ఈమె విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది.

ప్రస్తుతం కూడా ఈమె సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తన కెరియర్ ప్రారంభంలో కొన్ని ముద్దు సీన్లు ఉన్న సన్నివేశాల్లో నటించే అవసరం వచ్చిన సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ అలాంటి సినిమాల్లో నటించొద్దు అని మా పేరెంట్స్ చెప్పడంతో కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలను వదులుకున్నాను అని మృణాల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: