టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే జనసేన అనే ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక 2024 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగు దేశం , బి జె పి లతో పాటు పొత్తులో బాగంగా పోటీ చేయగా జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలలో గెలుపొంది అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

దానితో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు మరికొన్ని కీలక మంత్ర పదవుల్లో కూడా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి రాజమండ్రి లో ఈ మూవీ బృందం వారు ఓ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా శంకర్ గొప్ప దర్శకుడు అని , ఆయన సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది అని చెప్పాడు. అలాగే తన దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమాను నేను బ్లాక్ లో టికెట్ కొని మరి చూశాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: