కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు సూర్య. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అతని భార్య జ్యోతిక విషయానికి వస్తే, ఆమె కూడా వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతోంది. సూర్య, జ్యోతిక సెలబ్రిటీ కపుల్ బయట కూడా సేమ్ అంతే చూడచక్కగా ఉంటారు. వీరికి పండంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాప పేరు దియా, బాబు పేరు దేవ్. ఈ పిల్లల మీడియాకు దూరంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వారి ఫోటోలు వైరల్ అవుతుంటాయి. వీరి గురించి పెద్దగా ఎవరికీ ఏమీ తెలియదు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో సూర్య తన పిల్లల గురించి ప్రేక్షకులకు ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ పంచుకున్నాడు.

 అదేంటంటే, తన పిల్లలకు ఏ హీరో అంటే ఇష్టమో సూర్య చెప్పేశాడు. ఆ రివిలేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది. తన పిల్లలకు తమిళ స్టార్ హీరో విజయ్ అంటే చాలా అభిమానమట. విజయ్ నటించిన 'పులి' సినిమా చూసినప్పటి నుంచి వాళ్లు విజయ్‌కి పెద్ద అభిమానులయ్యారట. అందుకే వాళ్లు ముద్దుగా విజయ్‌ని 'పులి అంకుల్' అని పిలుచుకుంటారట. విజయ్ అంటే వాళ్లకి అంత ఇష్టం అని సూర్య చెప్పారు.

ఇకపోతే సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్, తల్లిదండ్రులు పెట్టిన పేరు అది. కానీ దర్శకుడు మణిరత్నం అతన్ని సూర్యగా పిలవడం ప్రారంభించారు. ఇండస్ట్రీలో ఆల్రెడీ శరవణన్ అనే నటుడు ఉండటంతో కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలని ఆయన పేరు మార్చారట. ఆసక్తికర విషయం ఏంటంటే, సూర్యకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు, దర్శకుడు అవ్వాలనే కోరిక ఉండేది. నటుడిగా మారకముందు ఆయన ఒక కార్మెన్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశారట.

1997లో వసంత్ దర్శకత్వంలో మణిరత్నం నిర్మించిన ‘నెరుకు నేర్’ సినిమాతో సూర్య సినీ రంగ ప్రవేశం చేశాడు. అయితే, మొదట్లో ఆయనకు పెద్ద విజయాలు దక్కలేదు. 2001లో వచ్చిన ‘నంద’ సినిమా సూర్య కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాకు బాలా దర్శకత్వం వహించారు.తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘కాకా కాకా’లో సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత నటించిన ‘గజిని’, ‘సింగం’ లాంటి సినిమాలు ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. ఇక సూర్య, జ్యోతిక దాదాపు ఐదేళ్లు ప్రేమించుకుని 2006లో పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: