"డాకు మహారాజ్".. ఈ పేరు వింటుంటేనే ఏదో తెలియని ఫీలింగ్ ఎక్కడో తెలిసినట్టుంది .. కానీ ఎక్కడా చదవలేదు. ఏదో తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది . చిన్న పిల్లలు సైతం డాకు మహారాజ్ ..డాకు మహారాజ్ అంటూ ఎక్కువగా ఈ పేరుని పలుకుతూ ఉన్నారు అన్న విషయం అందరికీ తెలుసు . కాగా బాలయ్య తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కానీ అన్ని సినిమాలలోకి స్పెషల్ టైటిలే ఈ "డాకు మహారాజ్". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ "డాకు మహారాజ్" సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .


సినిమా మొత్తం ఫుల్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కబోతుంది అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది . కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా "డాకు మహారాజ్" ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సూపర్ గా ఉంది . ప్రతి సెకండ్ సెకండ్ కి బాలయ్యలోని  డిఫరెంట్ యాంగిల్ చూపిస్తూ గూస్ బంప్స్ తెప్పించాడు డైరెక్టర్ బాబీ. అయితే ఈ సినిమాలో మరొక హీరో కూడా ఉన్నాడు అన్న విషయం ఇప్పుడు హైలైట్ గా మారింది.  బాబీ ఒక హీరోతో సరిపెట్టుకోడు . ఇద్దరు హీరోలని  సినిమాలో చూపిస్తాడు . వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా చిరంజీవి పక్కన రవితేజను చూపించి కథని మలుపు తిప్పేసాడు .



అలాంటి సత్తా ఉన్న డైరెక్టర్ బాబీ.  డాకు మహారాజ్ సినిమాలో సైతం ఒక తెలుగు హీరోని చిన్న పాత్రలో మెరిసేలా చేశాడట . ఆ విషయం బయటకు రాకుండా చాలా చాలా చాలా పక్కా ప్లాన్ తో దాపెట్టేసాడట.  థియేటర్స్ లో ఆ హీరో ఎంట్రీ చూస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోయే విధంగానే ఉంటుంది అనే రేంజ్ లో ఆ హీరో క్యారెక్టర్ ను రాసుకున్నారట.  ఆ హీరో మరెవరో కాదు మాస్ హీరో రవితేజ అని అంటూ తెలుస్తుంది . ఎస్ బాబీకి రవితేజ కి మధ్య ఎలాంటి స్పెషల్ బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే.



 వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజని చూస్ చేసుకున్నాడు బాబి . కాగా ఇప్పుడు బాలయ్య నటించిన "డాకు మహారాజ్" సినిమాలో రవితేజ కూడా ఒక చిన్న పాత్రలో మెరిసేలా చేశాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. అంతేకాదు బాలయ్య ఖాతాలో మరో వంద కోట్ల సినిమా పక్క అంటూ క్లారిటీగా చెప్పేసాడు బాబి.  అఖండ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన బాలయ్య ఆ తర్వాత వీర సింహారెడ్డి.. భగవంతు కేసరి సినిమాలతో ఆ పరంపర అలాగే కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు "డాకు మహారాజ్" తో కూడా మరో 100 కోట్లు తన ఖాతాలో వేసుకోవడానికి పక్కాగా రెడీ అయి ఉన్నాడు బాలయ్య అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేసేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: