విజయ్ నటించిన పులి సినిమాని పిల్లలు ఎన్నో సార్లు చూసారని అందుకే విజయ్ ను పులి అంకుల్ అని కూడా పిలుస్తారని .. అలాగే విజయ్ అంటే ఎక్కువ అభిమానమని ఆయన చెప్పకు వచ్చారు. ప్రస్తుతం సూర్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సూర్యకు సంబంధించిన విషయాలకి వస్తే .. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్ .. ఇది ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు .. అయితే దర్శకుడు మణిరత్నం శరవణన్ పేరును సూర్యగా మార్చారు ..శరవణన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటుడు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు అతనికి సూర్య అనే పేరు పెట్టారు. అలాగే సూర్య తన కెరియర్ మొదటిలో నటనపై అసలు ఆసక్తి చూపించేవారు కాదు .. చిన్నప్పుటి నుంచి దర్శకుడు కావాలని ఎన్నో కలలు కన్నారు .. సూర్య తన చదువు పూర్తయ్యాక నటన రంగంలోకి రాకముందే ఓ బడా కంపెనీలో మేనేజర్ గా పని చేశారు .
అయితే 1997లో వసంత్ దర్శకత్వం వహించిన మణిరత్నం నెరుకు నేర్ సినిమాతో సూర్య చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. సూర్య సినిమాల్లోకి వచ్చిన మొదటి నాలుగు సంవత్సరాలు పెద్దగా విజయాలు అందుకోలేకపోయాడు. అయితే 2001లో విడుదలైన నందా సినిమా సూర్య సినీ జీవితాన్నే కీలక మలుపు తిప్పింది. ఈ సినిమాకి తమిళ్ దర్శకుడు బాల దర్శకత్వం వహించారు. అలాగే గౌతమ్ మేనన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన కాకా కాకా మూవీలో సూర్య పోలీస్ ఆఫీసర్గా నటించారు .. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది .. అలాగే తర్వాత సూర్మ నటించిన గజిని , యముడు, సింగం వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు .. అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో సూర్య దగ్గరనుంచి మంచి కమర్షియల్ సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది.. ఎన్నో ఆశలు పెట్టుకొని సూర్య నటించిన కంగువ భారీగా నిరాశపరిచింది .. మరి రాబోయే రోజుల్లో అయినా సూర్య ఫామ్ లోకి వస్తారో లేదో చూడాలి.