టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక సంచలనం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, కేవలం తన టాలెంట్, పట్టుదలతో స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. ఆయన సినీ ప్రస్థానం ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్. చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు 150 సినిమాల్లో తనదైన మార్క్ చూపించాడు చిరు. తెలుగు సినిమా డ్యాన్స్‌ల గురించి మాట్లాడితే, వెంటనే గుర్తొచ్చే పేరు చిరంజీవి. ఆయన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. నటనలో ఆయన ఈజ్, డ్యాన్స్‌లో ఆయన చరిష్మాను మ్యాచ్ చేసేవారు లేరంటే అతిశయోక్తి కాదు. రీఎంట్రీ తర్వాత కూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారంటే ఆయన రేంజ్ అర్థం చేసుకోవచ్చు.

చిరంజీవి సినీ ప్రయాణం 1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో మొదలైంది. ఆ తర్వాత పది సినిమాల వరకు చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. కానీ, ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ మాత్రం 'కోతల రాయుడు' సినిమా. ఈ సినిమాలో చిరంజీవి నెగెటివ్ షేడ్స్‌లో అదరగొట్టాడు. తమ్మారెడ్డి భరద్వాజ, వాసు కలిసి నిర్మించిన ఈ సినిమాలో మాధవి హీరోయిన్‌గా నటించింది. చిరంజీవి మాత్రం కోతలు కోస్తూ, అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడిగా జీవించేశాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం చిరంజీవి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు!

'కోతల రాయుడు' విడుదలకు రెండు వారాల ముందు.. అప్పటికే ఎన్టీ రామారావు, రజినీకాంత్ కలిసి నటించిన 'టైగర్' సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతోంది. మరోవైపు ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం' సినిమా కూడా విడుదలైంది. ఇలాంటి భారీ సినిమాల మధ్య చిరంజీవి నటించిన 'కోతల రాయుడు' విడుదలైంది. ఎవరూ ఊహించని విధంగా ఆ రెండు పెద్ద సినిమాలను దాటేసి, ఏకంగా 100 రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

'కోతల రాయుడు'తో చిరంజీవి ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఆయన మెగాస్టార్‌గా ఎదిగిపోయాడు. ఒకానొక సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని చిరంజీవి చరిత్ర సృష్టించాడు. అదండీ మెగాస్టార్ స్టోరీ!


మరింత సమాచారం తెలుసుకోండి: