కావాలంటే విక్టరీ వెంకటేష్ ని తీసుకోండి.. సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్‌తో గోదారి గట్టు మీద పాటలో కెమిస్ట్రీ ఫిజిక్స్ అదిరిపోయేలా పండించాడు .. అలాగే మరో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి తోనూ కలిసి నటిస్తున్నారు వెంకటేష్ . బాలకృష్ణ సైతం గత కొన్ని సంవత్సరాలుగా కుర్ర హీరోయిన్లతోనే కలిసి నటిస్తున్నారు .. ప్రజెంట్ డాకు మహారాజులో అఖండలో కలిసి నటించిన ప్రగ్యా జైస్వాల్ తో పాటు శ్రద్ధ శ్రీనాథ్ , ఊర్వశి రౌతెలా లాంటి యంగ్ హీరోయిన్లతో కలిసి జతకట్టాడు బాలయ్య. అందులో ఊర్వశీతో అదిరిపోయే సాంగ్ కూడా ఒకటి చేశాడు ..
అలాగే గత సంవత్సరం చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో కూడా బాస్ పార్టీ అంటూ ఇరగదీసింది ఊర్వశి. ఇక చిరంజీవి సైతం ప్రస్తుతం విశ్వంభరలో త్రిషతో కలిసి నటిస్తున్నారు .. ఇక త్రిష సీనియర్ హీరోయిన్ అయినా.. వయసులో చిరంజీవి కంటే చాలా చిన్నది .. నాగార్జున కూడా ఆ మధ్య నా స్వామి రంగాలో అషికా రంగనాథ్ తో కలిసి రొమాన్స్ చేశాడు. ఇక రవితేజ కూడా తను నటించే ప్రతి సినిమాల్లోనూ కుర్ర హీరోయిన్స్ తో నే కలిసి నటిస్తున్నాడు .. ఇక తాజాగా మాస్ జాతరలో మరోసారి శ్రీలీలతో నటిస్తున్నారు .. ఇలా మొత్తానికి సీనియర్ హీరోల అందరికీ మరో ఆప్షన్ లేకుండా పోతుంది.