కొత్త సంవత్సరం వచ్చేసింది.. ఇక ఇప్పుడు 2025లో రాబోయే పెద్ద సినిమాలేంటి? ఏ హీరో ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో వస్తున్నారు? ఎవరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఇవన్నీ  తెలుసుకోవాలి కదా.. జనవరి నుంచి డిసెంబర్ వరకు రాబోయే 12 నెలలో ఏ ఏ భారీ సినిమాలు రాబోతున్నాయి ఒకసారి ఇక్కడ చూద్దాం.. 2025 లో వచ్చే పెద్ద సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. చూస్తూ ఉండగానే 2024 ముగిసిపోయింది .. 2025 కూడా వచ్చేసింది కొత్త సంవత్సరం వచ్చినప్పటికీ కొత్తగా ఏ సినిమాలు వస్తున్నాయి .. 2025లో వచ్చే పెద్ద సినిమాలు ఏంటి .. అనేది కూడా తెలుసుకోవాలి కదా..! సంక్రాంతి నుంచి ఈసారి పాన్ ఇండియా సినిమాల దండయాత్ర మొదలుకానుంది .. గేమ్ చేంజర్ అంటూ జనవరి 10న దేశమంతటా విధ్వంసం చేయబోతున్నారు రామ్ చరణ్. పొలిటికల్ ఎంటర్టైనర్ గా వస్తున్న గేమ్ చేంజ‌ర్ పై భారీ అంచనాలు ఉన్నాయి .. ఇక 2025లో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో రాబోతున్నాడు .. మార్చ్ 28న హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానుంది .. అలాగే తర్వాత ఓజిని కూడా తీసుకురాబోతున్నాడు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం కాస్త సమయం పట్టేలా ఉంది.


పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ప్రభాస్ కూడా 2025లో రెండు సినిమాలు తో వచ్చే అవకాశం ఉంది .. రాజా సాబ్ ఈ సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది .. కేవలం vfx మాత్రమే బ్యాలెన్స్ ఉంది .. అలాగే హను రాఘవపూడి తెర్కక్కిస్తున్న పౌజి సైతం 2025 చివరలో విడుదల కావచ్చు అని అంటున్నారు. అలాగే 2025లో రానున్న బిగ్గెస్ట్ సినిమాలలో విశ్వంభ‌రా కూడా ఒకటి .. బింబిసార ఫేమ్ వశిష్ట తెర్కక్కిస్తున్న ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెర్కక్కుతుంది . సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ కారణంగా సమ్మర్ కు షిఫ్ట్ అయింది. ఇక సంక్రాంతికి డాకు మహారాజుగా నట‌సింహం బాలయ్య వస్తున్నారు .. దసరాకు అఖండ 2 తో రాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇక 2024లో దేవరతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ .. 2025 లో బాలీవుడ్ ప్రేక్షకులను నేరుగా కలుసుకోబోతున్నాడు .. హృతిక్ రోషన్ తో కలిసి ఈయన నటిస్తున్న తొలి హిందీ సినిమా వార్ 2 ఆగస్టులో రిలీజ్ కానుంది .. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టటం పెద్ద మ్యాటర్ కాదని కూడా అంటున్నారు. నాని హిట్ 3 సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి .. మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది .. అలాగే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న VD 12 మూవీ కూడా ఈ సమ్మర్ లోని రిలీజ్ కానుంది .. అలాగే 2025లోనే రవితేజ మాస్ జాతర, తేజ సజ్జా మిరాయ్ , సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టు  లాంటి క్రేజీ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: