ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్ గా ఎనలేని క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట చిన్నాచితక పాత్రలో నటించి అనంతరం కీలక సన్నివేశాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం అనసూయ చేసే సినిమాలలో కీలక పాత్రలే చేస్తుండడం విశేషం. అనసూయ ఎప్పటికప్పుడు వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
రీసెంట్ గా పుష్ప-2 సినిమాలో తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. కాగా ఈ బ్యూటీ సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుండడం విశేషం.కాగా అనసూయకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. తాను కాలేజీ చదువుతున్న సమయంలో ఓ కుర్రాడితో రిలేషన్ కొనసాగించిందట. అతడిని వివాహం చేసుకోవాలని అనుకుందట. కానీ ఏవో కొన్ని కారణాలవల్ల వారిద్దరి రిలేషన్ బ్రేక్ అయిందని సమాచారం. ఆ తర్వాత అనసూయ భరద్వాజ్ సుశాంక్ భరద్వాజ్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం అనసూయ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.