క్లైమాక్స్లో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంటుందని దీంతో నేషనల్ అవార్డు గ్యారెంటీ అంటే సుకుమార్ కూడా తెలిపారు. నిజానికి రామ్ చరణ్ తో చేయడానికి కన్నా ముందు చిరంజీవితో డైరెక్టర్ శంకర్ ఒక సినిమాను ప్లాన్ చేశారట. అయితే ఎందుకొ అది వర్కౌట్ కాలేదని సమాచారం. అప్పుడు తండ్రితో కాకపోయినా ఇప్పుడు కొడుకుతో చేస్తున్నారు శంకర్. గేమ్ ఛేంజర్ సినిమా పోకిరి లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి అంటూ తెలియజేశారు.
మొదట మహేష్ తో కూడా ఒక సినిమా చేయాలనుకున్నారట. ఆమధ్య వార్తలు కూడా బాగా వినిపించాయి. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కూడా రాబోయే రోజుల్లో కచ్చితంగా మహేష్ తో సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ కరోనా సమయంలో డైరెక్టర్ శంకర్ సినిమా కోసం చర్చలు జరిపిన అది ఎందుకో వర్కౌట్ కాలేదని తెలిపారు శంకర్. ప్రభాస్ కటౌట్ కి శంకర్ మార్క్ సరైన కంటెంట్ పడితే కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బద్దలు అవ్వడం ఖాయమే అని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఏ మేరకు సినిమాలను తీస్తారో చూడాలి శంకర్.