అలాగే తాను పెద్దగా థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడనని..కానీ అల్లు అర్జున్ నటించిన చిత్రాలను మాత్రమే చూస్తానని తెలియజేసింది. పుష్ప2 సినిమాకి మాత్రం తన కొడుకుతో కలిసి వెళ్లానని అది కూడా ఫస్ట్ రోజు చూశానని వెల్లడించింది. అల్లు అర్జున్ కి నటన పట్ల ఉన్న డెడికేషన్ వర్క్ వల్ల సినిమా అద్భుతంగా ఉంటాయని ప్రశంసలు కురిపించింది సునీత అహుజా. తాను హైదరాబాద్ కి వెళ్ళిన ప్రతిసారి కూడా అల్లు అర్జున్ ని కలుస్తూ ఉంటానని వెల్లడించింది.
అల్లు అర్జున్ కూడా ఒక గ్రేట్ పర్సన్ అంటూ ప్రశంసిస్తున్న సునీత మాటలు విన్న అభిమానులు సైతం ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు. అతడికి సిక్స్ ప్యాక్ బాడీ అవుట్ లుక్ చూసి ఫ్యాన్ అవుతూ ఉంటారు..కానీ స్కిల్స్ వంటివి చూసి ఆయన అభిమానిగా మారాను అంటూ తెలిపింది సునీత. ఇక అల్లు అర్జున్ ఇటీవలే సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన వల్ల కోర్టులు కేసుల చుట్టూ తిరుగుతూ సతమతమవుతున్నారు. ఈరోజు కూడా మళ్లీ నాంపల్లి కోర్టు వద్దకు వెళ్లి సంతకం చేసి వచ్చారు అల్లు అర్జున్. అయితే ప్రతి ఆదివారము వచ్చి సంతకం పెట్టేలా అధికారులు వెల్లడించినట్లు సమాచారం.