భారతదేశంలోని ఏ చిత్ర పరిశ్రమలో చూసుకున్నా హీరోయిన్స్ విషయంలో పరిస్థితులు ఒకింత ఇంట్రెస్ట్ గానే ఉంటాయని చెప్పొచ్చు. అప్పటి వరకు ఎన్ని సినిమాలు ఎన్ని పాత్రలు చేసినప్పటికీ ఒక్క సినిమా చాలు ఆ హీరోయిన్ ని ఓవర్ నైట్ లో స్టార్ ని చేసి పెడుతుంది. ఇలా ఇటీవల కాలంలో కొందరు హీరోయిన్స్ మాత్రమే కెరీర్ పరంగా మంచి హైట్స్ చూడగలిగారని చెప్పాలి.కాగా గత ఏడాది వచ్చిన యానిమల్ సినిమాలో మెయిన్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. అయినప్పటికీ ఆ సినిమాలో సెకండాఫ్ లో వచ్చిన సెకండ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే తన కంటే ముందు ఓ రేంజ్ లో స్టార్డం ని సొంతం చేసుకున్న హీరోయిన్ మాత్రం సౌత్ ‌కు చెందిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి అని చెప్పొచ్చు.పాన్ ఇండియా హిట్ చిత్రం కేజీఎఫ్ 1 లో నటించిన ఈమె అందరి దృష్టిని మొదట బాగా ఆకర్షించింది. కానీ పార్ట్ 2తో మాత్రం ఒక్కసారిగా శ్రీనిధి శెట్టి ఫాలోవర్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయారు. ఇలా అక్కడ నుంచి మంచి క్రేజ్ ని శ్రీనిధి శెట్టి సొంతం చేసుకోగా కేవలం కన్నడ సినిమాలే కాకుండా ఇతర భాషల్లో కూడా గట్టి ఆఫర్లు అందుకుంది.

ఇలా ప్రస్తుతం తెలుగులో కూడా సాలిడ్ సినిమాలు ఈమె చేస్తుండగా ఇవి కాకుండా మరో క్రేజీ ఆఫర్ ని ఈ అమ్మడు పట్టేసినట్టుగా ఫిలింనగర్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి.అవేమిటంటే టిల్లు సిద్దు జొన్నల గడ్డ నెక్ట్స్ ప్రాజెక్ట్ తెలుసు కదా మూవీలో ఆఫర్ కొల్లగొట్టింది ఈ భామ. దీనితో పాటు హిట్ సిరీస్ లోనూ నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. నానితో జతకట్టే లక్కీ ఛాన్స్ పొందింది. ఇదే కాదు కిచ్చా సుదీప్ 47వ సినిమాలో కూడా యాక్ట్ చేసే ఆఫర్ ను సొంతం చేసుకుంది. ఇలా మూడు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడు రష్మికలా ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్ బాట పడుతుందేమో చూడాలి.ప్రస్తుతం శ్రీనిధి శెట్టి తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన ఆమె నటిస్తుండగా తెలుగులో ఆమె ఎంట్రీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి తన ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: