తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభు గణేషన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తాజాగా ఈ నటుడుకి బ్రెయిన్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పైన టీం స్పందించడం జరిగింది. చెన్నైలోనే ఒక ప్రముఖ హాస్పిటల్ లో ఈ సర్జరీ విజయవంతంగా పూర్తి అయినట్లు తెలుపడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు  ప్రస్తుతం ప్రభు తనను డిశ్చార్జ్ చేశారని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ టీం తెలిపింది.


ప్రభు గత కొద్దిరోజులుగా జ్వరం తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరగా ఆయనను వైద్యులు పరిశీలించి మెదడులో రక్తనాళం లో వాపు ఉన్నట్లుగా గుర్తించారట.. దీంతో తనకి చిన్నపాటి సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ లెజెండ్రీ నటుడుగా పేరుపొందిన శివాజీ గణేషన్ తనయుడే ఈ ప్రభు.. అగ్ని నక్షత్రం, చిన్నతంబి, చార్లీ చాప్లిన్ తదితర చిత్రాలలో తమిళంలో నటించి వారి పాపులారిటీ సంపాదించుకున్నారు.


తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా డార్లింగ్ చంద్రముఖి దరువు దేనికైనా రెడీ తదితర చిత్రాలలో నటించి భారీగానే పేరు సంపాదించారు ప్రభు గణేషన్. దాదాపుగా 200 పైగా సినిమాలలో నటించిన ఈ నటుడు ప్రస్తుతం గుడ్ బాడ్ అగ్లీ సినిమా లో నటిస్తూ ఉన్నారు ఈ చిత్రంలో హీరోగా అజిత్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా త్రిష నటిస్తోంది. మొత్తానికి ఈ బ్రెయిన్ సర్జరీ విజయవంతం అవడంతో ఆరోగ్యంగా ప్రభు గణేషన్ త్వరగా కోలుకోవాలంటు అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలకు కూడా  ఈయనకు సపోర్టుగా నిలుస్తూ  ధైర్యాన్ని చెబుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో చాలా తక్కువగా కనిపిస్తున్నప్పటికీ తమిళంలో పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా తెలుగులో ఏవైనా సినిమాలలో నటిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: