టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. దర్శకుడు త్రివిక్రమ్ పై మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) లో ఫిర్యాదు చేసి చాలా కాలమైందని తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని త్రివిక్రమ్ ను ప్రశ్నించడం లేదా అతనిపై చర్యలు తీసుకోవడం జరగలేదని ఆరోపించింది. తన జీవితంలో ఆనందం... ఆరోగ్యం లేకుండా చేశాడని ఇప్పటికీ ఆయనను ఇండస్ట్రీలో పెద్దగా ప్రోత్సహిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే గతంలోనూ పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ట్వీట్లు చేసింది. కానీ ఎప్పుడూ కూడా దర్శకుడు త్రివిక్రమ్ పేరు ఎత్తలేదు. ఇన్ డైరెక్ట్ గా తన ఆవేదన వ్యక్తం చేస్తూ పలమార్లు ట్వీట్లు చేసింది. ఓ దర్శకుడు తనను మోసం చేశాడని ఆరోపించింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో పార్వతి మెల్టన్ స్థానంలో పూనమ్ కౌర్ ను అనుకున్నారని కూడా కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ప్రాజెక్టు నుంచి తొలగించాలని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు పూనమ్ త్రివిక్రమ్ పేరు ఎత్తలేదు. కానీ తాజాగా చేసిన ట్వీట్ లో గురూజీ పేరు ఎత్తడం హాట్ టాపిక్ గా మారింది. ఇక పూనమ్ కౌర్ టాలీవుడ్ లో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కనుమరుగైపోయారు. సినిమాలు చేస్తున్న సమయంలోనే ఓసారి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ తర్వాత సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాలపై, రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి తాజాగా ఆమె చేసిన ఆరోపణలపై మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా ఈ పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: