టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పటివరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు అనేక సినిమాలను నిర్మించి అందులో చాలా మూవీలలో మంచి విజయాలు అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం దిల్ రాజు ... సిద్ధార్థ్ హీరోగా హన్సిక హీరోయిన్గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ మై ఫ్రెండ్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో శృతి హాసన్ , సిద్ధార్థ్ కి స్నేహితురాలి పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి అందుకోలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... వేణు శ్రీరామ్ "ఓ మై ఫ్రెండ్" సినిమా కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. దానితో వెంటనే సినిమా స్టార్ట్ చేశాం. సినిమా మొత్తం పూర్తి అయింది. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఓకే అనిపించింది , కాని సెకండ్ ఆఫ్ నాకు పెద్దగా నచ్చలేదు.

దానితో కొన్ని కామెడీ సీన్ లను కూడా సెకండ్ హాఫ్ లో చేర్చాం. అయిన నాకు ఆ సినిమా గొప్పగా అనిపించలేదు. దానితో కొంత మంది తో నేను ఆ సినిమా సక్సెస్ కాదు అని చెప్పాను. కానీ వారంతా ఆ సినిమా చూసి బాగుంది విజయం సాధిస్తుంది అని నమ్మారు. ఇక సినిమా విడుదల అయింది. మొదట కొంత మంది దగ్గర నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన ఓవరాల్ గా ఈ మూవీ ప్రేక్షకులను పెద్ద స్థాయిగా ఆకట్టుకోలేక పోయింది. చివరకు నేను చెప్పిన విధంగానే ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోలేదు అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: