ప్రతి సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంక్రాంతి పండక్కు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇక ఇలా భారీ పోటీలో కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకొని భారీ కలక్షన్లను వసూలు చేసే సంక్రాంతి విన్నర్ గా నిలుస్తూ ఉంటాయి. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ తాను నటించిన ఎన్నో సినిమాలను సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేశాడు. అందులో కొన్ని సినిమాలు సంక్రాంతి విన్నర్ గా నిలిచాయి. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

కృష్ణ : రవితేజ హీరోగా త్రిష హీరోయిన్ గా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2000 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాసిటివ్ టాక్ ను వచ్చింది. దానితో ఈ మూవీ ఆ సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల అయిన అన్ని సినిమాలు కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మిరపకాయ్ : రవితేజ హీరో గా రీఛా గంగోపాధ్యాయ , దీక్ష సేథ్ హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2011 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

క్రాక్ : రవితేజ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2021 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఆ సంవత్సరం అనేక సినిమాలతో పోటీ పడి భారీ కలెక్షన్లను వసూలు చేసే 2021 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: