హనీ రోజ్ 14 ఏళ్ల వయస్సులోనే తన కెరీర్ను ప్రారంభించింది. ఈమె నటనకు, అందానికి ఫాన్స్ కూడా ఉన్నారు. అయితే ఈ నటి ఈ మధ్యకాలంలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డిలో బాలయ్య సరసన నటించి కేరీర్ లో అతి పెద్ద హిట్ సినిమాను సొంతం చేసుకుంది. దీంతో ఈ భామకు ఇప్పుడు డిమాండ్ కూడా పెరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో కూడా ఫాన్స్ ఎక్కువైపోయారు.
అయితే తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్టులో.. తనను ఓ బిజినెస్ మ్యాన్ వెంబడిస్తున్నాడాని రాసుకొచ్చింది. అలాగే తనని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. గతంలో హనీ రోజ్ ఓ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్ కు వెళ్ళింది అంట. అయితే అప్పటినుంచి ఆ వ్యక్తి తన వెంటపడుతూ.. సోషల్ మీడియాలో కూడా తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడని.. ఆ వ్యక్తిపై చట్టపరంగా పోరాడుతానని నటి హనీ రోజ్ తెలిపింది. ఇక ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.