భారతీయ సినీ సంగీత దర్శకుడు తమన్ అంటే గుర్తుపట్టనివారు ఉండరు. తమన్ సంగీత తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేస్తాడు. ఈయన తొలిచిత్రం రవితేజ నటించిన కిక్, అలాగే తమన్ బాయ్స్ చిత్రంలో సైడ్ యాక్టర్ గా ఒక పాత్రలో కనిపించాడు. తమన్ పొట్టేపాళెం, నెల్లూరు జిల్లా సంగీతకారుల కుటుంబానికి చెందినవాడు. తమన్ నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. తమన్ తన సంగీతంతో గొప్ప గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈయనకు వెయిలల్లో ఫాన్స్ ఉన్నారు. ఏ సినిమాకు అయిన తమన్  సంగీతం అందిస్తున్నాడు అంటే చాలు ఆ సినిమా ఆల్బమ్ దూసుకుపోవడం ఖాయం.
అయితే తమన్ ఇటీవల రెండు పవర్ పాక్ట్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. మెగా హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక సంక్రాంతి కానుకగా ధియేటర్ లో విడుదల కానున్న గేమ్ చేంజర్ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే టాలీవుడ్ హీరో బాలయ్య బాబు, దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటికే వెంకటేష్ హీరోగా తెరకెక్కిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని పాటలు మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తున్నాయి. దాంతో తమన్ పాపం ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ అందించడం కోసం చాలా కష్టం పడుతున్నట్లు.. నిద్ర కూడా లేకుండా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తమన్ ఎలాంటి మ్యూజిక్ ని అందిస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: