సినిమాను సినిమాలా చూడాలి కానీ ఈ మధ్య సినిమాలకు రాజకీయ రంగు పూస్తున్నారు. అంతేకాకుండా మన భాష, పరభాష అని తేడాలు చూస్తున్నారు. ఒకప్పుడు సినిమా ఏ భాషలో వచ్చిన బాగుందంటే ప్రేక్షకులు ఆదరించేవారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఏ భాషలో వచ్చిన సినిమా అయినా సరే సూపర్ హిట్ అయింది. అంటే తప్పకుండా థియేటర్లకు వెళ్లి చూస్తారు. కానీ ఈ మధ్య ఇతర రాష్ట్రాల్లో తెలుగు సినిమాలను ఆడనివ్వకూడదని కుట్ర జరుగుతోంది. తెలుగు సినిమా ఫ్యాన్ ఇండియా స్థాయిలో సత్తా చూపిస్తుంది. 
ఇక్కడి సినిమాలను కొంతమంది పక్క పక్క రాష్ట్రాల వాళ్లు పగబట్టినట్టే చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కర్ణాటకలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పోస్టర్లను గోడలపై అంటించారు.  అయితే ఆ పోస్టర్లను కొంతమంది తీసివేస్తూ వాటిపై కన్నడ అని రాస్తున్నారు. పోస్టర్లపై నలుపు రంగు వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ లో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. కన్నడ నుండి ఇటీవల విడుదలైన కాంతారా సినిమాకు తెలుగులో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అదే విధంగా చార్లీ సినిమాకు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటితోపాటు కేజీఎఫ్ సినిమా అయితే రికార్డులు క్రియేట్ చేసింది.
ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కన్నడ సినిమాలను తెలుగు ప్రేక్షకులు అంతలా ఆదరిస్తే.. మన సినిమాల పోస్టర్ లే చింపేస్తారా అని తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం కర్ణాటకలోనే కాదు.. తమిళనాడులోను తెలుగు సినిమాపై వివక్ష కనిపిస్తోంది. అప్పట్లో తమిళ స్టార్ విజయ్ హీరోగా నటించిన సినిమాను దిల్ రాజు నిర్మించినప్పటికీ తమిళ్ లోనే నేరుగా షూటింగ్ చేయాలని అక్కడ ప్రేక్షకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమాలు ఎంత బాగున్నా కావాలనే థియేటర్లకు వెళ్లారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు నార్త్ లోనూ టాలీవుడ్ హీరోలు సత్తా చాటుతుంటే సోషల్ మీడియాలో మాత్రం తెలుగు సినిమాలను అక్కడివారు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: