టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలో అత్యంత ఖరీదైన కమెడియన్ గా బ్రహ్మానందం పేరు తెచ్చుకున్నారు. అందుకు కారణం తాను సంపాదించిన ప్రతి రూపాయిని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టడంతో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. ఎటువంటి దురాలవాట్లు లేకపోవడంతో ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకొని తన ఆస్తులను విపరీతంగా పెంచుకున్నాడు. 


బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు. తన వారసుడిగా పెద్ద కొడుకు గౌతమ్ ను సినీ రంగానికి పరిచయం చేశారు. కానీ అతను హీరోగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం బసంతి, మను అనే సినిమాలలో నటించారు. సినిమాలకన్నా ముందే గౌతమ్ వ్యాపారాలు నిర్వహిస్తుండేవాడు. సినిమాలు పెద్దగా ఆడకపోయేసరికి పూర్తి స్థాయిలో వ్యాపారాలపై తన దృష్టిని పెట్టాడు.


బ్రహ్మానందం విపరీతంగా ఆస్తులను కూడబెట్టాడు. గౌతమ్ ఆ హాస్తులను పెద్దవి చేస్తూ వచ్చేవాడు. హైదరాబాద్ నగరంలో భారీగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. వాటి నుంచి విపరీతంగా ఆదాయం వస్తుంది. అలాగే బెంగుళూరులో పదుల సంఖ్యలో రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే ఆదాయం, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం కలిపి ఐటీ కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. ఆ కంపెనీల నుంచి ఊహించని స్థాయిలో ఆదాయాలు వస్తున్నాయి.


ప్రస్తుతం గౌతమ్ నెలకు రూ. 30 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అంటే సంవత్సరానికి రూ. 360 కోట్లు సంపాదిస్తున్నాడు. దీనిని మరో కంపెనీలో పెట్టుబడిగా పెట్టి ఆదాయాన్ని మరింతగా పెంచుకుంటున్నారట. హీరోగా సినీ ఇండస్ట్రీలో రాణించకపోయినప్పటికీ వ్యాపారాలలో మాత్రం గౌతమ్ విపరీతంగా రాణిస్తున్నారు.  ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం పేరు మీద కూడా ఆస్తులు ఉన్నాయ్. టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం కోడలు పేరు పైన ఆస్పత్రులు ఉన్నాయని సమాచారం.





మరింత సమాచారం తెలుసుకోండి: