న్యూస్ రీడర్ గా గుర్తింపు సంపాదించుకున్న అనంతరం టెలివిజన్ సీరియల్స్ లో నటిగా పరిచయమైంది. 2017లో మేయ ధమాన్ అని తమిళ సినిమా ద్వారా నటిగా పరిచయమైంది. ఆ సినిమాలో తన మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అభినయం, నటనతో మెప్పించింది. తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం ప్రియా భవాని శంకర్ తెలుగు సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కళ్యాణం కమనీయం వంటి సినిమాలలో ప్రియా భవాని శంకర్ నటనకు మంచి ఆదరణ లభించింది. అనంతరం రుద్రుడు, తిరు, ఏనుగు, చినబాబు, అహం బ్రహ్మాస్మి, బీమా, జీబ్రా, రత్నం వంటి తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రియా భవాని శంకర్ తన సహజమైన అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ బ్యూటీకి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రియా భవానికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన అందాలను ఆరబోస్తూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ప్రియా భవాని ఎంచుకునే పాత్రలు ఆమె నటనకు మంచి గుర్తింపును తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం ప్రియా భవాని శంకర్ తెలుగు, తమిళం సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఒకప్పుడు రిపోర్టర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.