తాజాగా విజయవాడలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం అనే భారీ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో మన తెలుగు ఇండస్ట్రీ నుండి పాటల రచయిత అయినటువంటి అనంత శ్రీరామ్ పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ..సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హిందూ ధర్మాన్ని అవమానించేలా సినిమాలు తీస్తున్నారు.. మార్కెట్ ఉంటుందనే కారణంతో హిందువులను హిందూ ధర్మాన్ని అవమానించిన కూడా నిర్మాతలు సైలెంట్ గా ఉంటున్నారు. డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారు.తిరుపతి ఆలయాన్ని కించపరిచినట్టు చేసినా కూడా నిర్మాతలు సైలెంట్ అవుతున్నారు. సినిమాలో స్వామీజీలను,గురూజీలను పోలిన పాత్రలు చేస్తూ అవమాన పరుస్తున్నారు. ఇక రీసెంట్ గా విడుదలైన కల్కి సినిమాలో మహాభారతాన్ని పూర్తిగా మార్చేశారు. కర్ణుడు ఎలా గొప్పవాడు అవుతాడు. 

నిండు సభలో ద్రౌపదిని చీరలాగి అవమానిస్తున్న సమయంలో సైలెంట్ గా ఉన్న కర్ణుడు గొప్పవాడా.. కర్ణుడు సూర్యుడు నుండి వచ్చాడు. అర్జునుడు అగ్నిదేవుడి నుండి వచ్చాడు.అర్జునుడు కంటే కర్ణుడు గొప్ప అంటే హిందూ ధర్మం ఒప్పుకుంటుందా.. కర్ణుడి పాత్రని గొప్పగా చేసి కల్కి సినిమాలో చూపించారు. కానీ అదే కృష్ణా జిల్లాకు చెందిన నిర్మాతలు,దర్శకులు ఎవరు నోరు విప్పలేదు.ఈ సినిమాలో కర్ణుడిని గొప్పగా చేసి చూపించారు ఆ సినిమా చూసినందుకు నేను సిగ్గుపడుతున్నా.. సినిమాల కోసం ఇలా పురాణాల్లో ఉన్న వారి పాత్రలను గొప్పగా చేసి చూపిస్తే హిందూ ధర్మాన్ని అవమానించినట్టే.. వాల్మీకి,వ్యాసుడు రాసిన ఎన్నో రచనాలను వినోదం కోసం వక్రీకరించి చూపించారు. భారత భాగవతంలోనే కాదు రామాయణంలోనూ ఇష్టా రీతిలో పురాణాలను మార్చేస్తూ హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు.

దమ్మారో ధమ్ అంటూ హరే రామ హరే కృష్ణ అని అవమానిస్తున్నారు. అలాగే ఇస్కాన్ వారి నినాదాన్ని సిగరెట్ తాగుతూ కించపరుస్తున్నారు. హిందూ ధర్మాన్ని అనుసరించకుండా హిందూ ధర్మాన్ని వక్రీకరిస్తూ సినిమాలు తీస్తున్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ క్షమాపణలు చెప్పాల్సిందే.ఇలాంటి సినిమాలు తీసే ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను సిగ్గు పడుతున్నాను.. ఇవన్నీ చూస్తూ సైలెంట్ గా ఊరుకుందామా.. లేకపోతే మనం హిందువులం అందరం ఏకమై వీటిని బహిష్కరిద్దామా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనంత శ్రీరామ్

మరింత సమాచారం తెలుసుకోండి: