సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. మహేష్ బాబు దసరా పండుగ సందర్భంగా కూడా చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో భాగంగా 2011 వ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా మహేష్ "దూకుడు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్గా నటించగా ... ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ లో సోనుసుద్ విలన్ పాత్రలో నటించగా ... బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ 2011 వ సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఆ సంవత్సరం దసరా పండక్కి బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకని ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టులో చేరిపోయింది.

ఇకపోతే ఈ మూవీ లోని మహేష్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా ద్వారా సమంత క్రేజ్ ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమలో పెరిగిపోయింది. ఈ మూవీ లో బ్రహ్మానందం తన అద్భుతమైన కామిడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , మహేష్ కి తండ్రి పాత్రలో నటించాడు. ఇక తమన్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించగా ... ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి శ్రీను వైట్ల పై కూడా ప్రశంసల వర్షం కురిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: