ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. అందులో మొదటగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ జనవరి 10 వ తేదీన విడుదల కానుండగా ... 12 వ తేదీన బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ , 14 వ తేదీన వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. ఇకపోతే డాకు మహారాజ్ సినిమాకు నైజాం ఏరియాలో థియేటర్ల సమస్య పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అంచనా వేస్తున్నారు.

స్టార్ హీరో సినిమాకు ఎందుకు థియేటర్ల కొరత నైజాంలో వస్తుంది అనే కోణంలో ఆలోచించినట్లయితే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ యొక్క నైజాం హక్కులను దిల్ రాజు కి అప్పగించారు. గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను నిర్మించింది దిల్ రాజు. దానితో ఆయన గేమ్ చేంజర్ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించడంతో నైజాం ఏరియాలో మొదటి ప్రాముఖ్యతను ఆ సినిమాకు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 150 కి పైగా ఏషియన్ థియేటర్స్ ఉన్నాయి. ఈ థియేటర్లలో వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు భాగస్వామ్యంలో ఉండడంతో తన తమ్ముడు హీరోగా రూపొందిన సంక్రాంతి వస్తున్నాం సినిమాకు ఏషియన్ థియేటర్లలో ఎక్కువ శాతం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దానితో ఓ వైపు గేమ్ చేంజర్ మరో వైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు పెద్ద మొత్తంలో థియేటర్లు నైజాంలో దక్కిన డాకు మహరాజ్ సినిమాకే కాస్త తక్కువ థియేటర్లు దక్కే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఏదేమైనా కూడా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలా సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో ఏదో ఒక సినిమాకు తక్కువ థియేటర్లు దొరకడం అనేది చాలా సాధారణమైన విషయం. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచి టాక్ వస్తే లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లు వస్తాయి అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: