టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది వెంకటేశ్ పేరు జవాబుగా చెబుతారు. వెంకటేశ్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ల జాబితాలో సంక్రాంతి మూవీ ముందువరసలో ఉంటుంది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టడంతో పాటు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించింది. వెంకటేశ్, శ్రీకాంత్, శివ బాలాజీ, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.
 
ముప్పలనేని శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఎస్.ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఆ బ్యానర్ కు సైతం మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలోని పాటలు సైతం అంచనాలకు మించి హిట్ గా నిలిచాయి.
 
ఈ సినిమాలో సంక్రాంతి పండుగ విశిష్టతను చెప్పే సన్నివేశాలు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. వెంకటేశ్ నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. 2005 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన సంక్రాంతి మూవీ రిలీజై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఆర్తి అగర్వాల్, స్నేహ, సంగీత ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించి తమ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.
 
సుధాకర్ ఈ సినిమాలో కమెడియన్ గా నటించి మెప్పించారు. సంగీత ఈ సినిమాలో గయ్యాళి భార్యగా నటించారు. సంక్రాంతి సినిమాలో ప్రతి ఒక్కరూ తమ అద్భుతమైన నటనతో నటించి మెప్పించారు. ఈ సినిమాలో ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. కథ, కథనం విషయంలో ఊహించని ట్విస్టులు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సంక్రాంతి సినిమా అప్పట్లో కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టింది. యూట్యూబ్ లో సైతం ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: