మొన్నటి దీపావళి పండుగ సందర్భంగా చాలా సినిమాలు వచ్చాయి. అందులో చిన్న బడ్జెట్ తో వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి.. అందులో ఒకటి క. సినిమా పేరు సింపుల్ గా క అని పెట్టారు. ఈ సినిమాను రెండు పార్టులుగా కూడా తీస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. సుజిత్ అలాగే సందీప్ దర్శకత్వంలో ఈ సినిమాను చాలా గ్రాండ్గా తీయడం జరిగింది.


మొదట కిరణ్ అబ్బవరం సినిమా ఏముంటుందిలే అని అందరూ అనుకున్నారు. కానీ దీపావళి పండుగ సందర్భంగా విడుదలై... లక్ష్మీ బాంబుల బాక్స్ ఆఫీస్ ముందు పేలింది. ఈ సినిమా అంచనాలను మించి.. హిట్ అందుకుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ సందర్భంగా నే హీరో కిరణ్ అబ్బవరం ఇదే వ్యాఖ్యలు చేశారు. సినిమా హిట్ కాకపోతే.. ఇకపైన ఇండస్ట్రీ మొఖం కూడా చూడనని శపథం చేశారు కిరణ్ అబ్బవరం.


సినిమా మొత్తం క్రిష్ణగిరి అనే గ్రామంలో జరిగింది. అక్కడ తొందరగా చీకటి పడుతుంది. ఆ సమయంలో గ్రామంలో ఉన్న అమ్మాయిల కిడ్నాప్ చేస్తూ ఉంటారు. అలా అమ్మాయిలను కిడ్నాప్ చేసి విదేశాలకు తరలిస్తూ ఉంటారు. అయితే.. ఆ కిడ్నాప్ లను హీరో ఎలా కట్టడి చేస్తాడు అనేదే సినిమా స్టోరీ. ఇక ఈ సినిమాను దాదాపు 20 కోట్లతో తీస్తే... 70 నుంచి 80 కోట్ల వరకు వచ్చాయట. ఇంత చిన్న సినిమాను... ప్రేక్షకులు ఆదరించి.. థియేటర్లలో చూడగలిగారు.


అలాగే ఐ ఎం డి బి లో 10 పాయింట్లకు గాను దాదాపు 7.5 రేటింగ్ ఇవ్వడం మనం చూసాం. అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమా కాస్త  చిక్కులు ఉన్నప్పటికీ... ఆ తర్వాత క్లారిటీగా ఉంటుంది. దీంతో సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకోవడం జరిగింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 కూడా త్వరలో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈటీవీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: