ఇటీవలే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా డల్ హౌస్ లో చాలా గ్రాండ్ గానే చేశారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో డాకు మహారాజ్ రెండు ఈవెంట్స్ ని ప్లాన్ చేసేలా చేస్తున్నారట నిర్మాత నాగ వంశీ.. అయితే ఇందులో ఒకటి రాయలసీమలోని అనంతపురంలో పెద్ద ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈవెంట్ కి బాలయ్య పెద్ద అల్లుడు మంగళగిరి ఎమ్మెల్యే, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం.
మరి మామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లుడు రావడంతో కచ్చితంగా ఈ డాకు మహారాజ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వరల్డ్ వైజ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. మరి రెండవ ఈవెంట్ హైదరాబాదులో ఎక్కడ చేస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మొత్తానికి డాకు మహారాజ్ సినిమా కోసం బాలయ్య అల్లుడిని దింపుతున్నారు.. డాకు మహారాజ్ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించడమే కాకుండా మరి కొంతమంది నటీనటులు ఇందులో నటిస్తూ ఉన్నారు.