శతమానం భవతి.. సినిమా పేరు వింటేనే చాలామందిలో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన శతమానం భవతి సినిమా చిన్న సినిమాగా వచ్చి అతి పెద్ద హిట్ కొట్టింది.. సతీష్ వేగేష్న దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా చేశారు. చిన్న హీరో అయినటువంటి శర్వానంద్ అనుపమ పరమేశ్వరన్ కాంబోలో ప్రకాష్ రాజ్, జయసుధ, ఇంద్రజ లు కీలక పాత్రల్లో నటించిన శతమానం భవతి మూవీ 2017 సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ మూవీస్ కి పోటీగా విడుదలైంది. అలా శతమానం భవతి సినిమా బాలకృష్ణ నటించిన గౌమీ పుత్ర శాతకర్ణి, చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాల కంటే శతమానం భవతి మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. 

ఎందుకంటే ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఎక్కువ ప్రజాధరణ పొందిన సినిమాగా పేరు తెచ్చుకొని కమర్షియల్ గా హిట్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన శతమానంభవతి ఇంత పెద్ద హిట్ అవుతుందని నిర్మాత, డైరెక్టర్ కూడా అనుకోలేదట.అలా ఈ సినిమా నిర్మాతకి దాదాపు 16 కోట్ల లాభాలను కూడా తెచ్చిపెట్టిందట. అలా 2017 లో విడుదలై ఎక్కువ ప్రజాధరణ పొందిన సినిమాగా నేషనల్ అవార్డు కూడా శతమానంభవతి సినిమాకు వచ్చింది. అలా చిన్న సినిమా పెద్ద హిట్ సాధించింది. అంతేకాదు ఈ సినిమా ఇప్పుడికి కూడా టీవీలలో వస్తే చాలామంది ఇష్టంగా చూస్తారు.

అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శతమానంభవతి మూవీకి సీక్వెల్ కూడా ఉంటుంది అని దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమాకి డైరెక్టర్ మారుతారని సమాచారం కూడా అందుతుంది.ఇక శతమానం భవతి మూవీకి మొదట రైటర్ గా చేసిన హరి ఈ సినిమాకి కథ అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈయనే డైరెక్షన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే టాక్ వినిపిస్తోంది. అలాగే హీరో హీరోయిన్లను కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే ఈ సీక్వెల్ ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారు అని ప్రచారం జరుగుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: