నందమూరి బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజా చిత్రం జనవరి 12 న రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. యాక్షన్ ఎంటర్టైన్మెంట్  చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తూ ఉన్నారు. అలాగే ఇందులో స్పెషల్ సాంగ్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా నటిస్తూ ఉన్నది. ఇటీవలే స్పెషల్ సాంగ్కు సంబంధించి పాటను కూడా విడుదల చేయడం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా ఇప్పటికే ప్రమోషన్స్లో శరవేగంగా పాల్గొంటున్నారు.


ట్రైలర్ కూడా ఇటీవల విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా దబిడి దిబిడే సాంగును రిలీజ్ చేసిన మేకర్స్ కొద్ది గంటలలోనే ఈ పాట ట్రెండీ గా మారిపోయింది. అయితే ఇందులోని బాలయ్య వేసిన స్టెప్పులు సైతం విమర్శలు చేయడంతో పాటుగా కొరియోగ్రాఫర్ గురించి కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం పైన నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోలర్లకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది..


తన ట్విట్టర్ నుంచి ఇలా రాసుకోస్తూ.. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎంత హిట్ అయింది.. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక ,సాంగ్ ఎలా హిట్ అయింది.. డాకు మహారాజు దబిడి దిబిడే సాంగ్ కూడా హిట్ అంటూ ఈ మూడు సాంగ్లకు సంబంధించి ఒక విషయాన్ని తెలియజేస్తూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో బాలయ్య అభిమానులు కూడా ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు అంటూ  ఈ విషయాన్ని వైరర్ గా చేస్తూ ఉన్నారు. బాలయ్య సోషల్ మీడియాలో చాలా తక్కువగానే యాక్టివ్ గా ఉంటారు కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: