బిగ్ బాస్ సీజన్ 8 లో విన్నర్ నిఖిల్ మాలియక్కల్ కి మామూలు క్రేజ్ లేదు. బుల్లితెర నటుడు నిఖిల్ కన్నడ లోని మైసూర్ లో జన్మించారు. ఆయన తండ్రి జర్నలిస్టు, తల్లి నటి కావడంతో చిన్నప్పటి నుండే నిఖిల్ కి డాన్స్, సినిమాలపై ఆసక్తి మొదలైంది. 2016 లో ఊటి సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన స్టార్ మా లో ప్రసారం అయ్యే గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అందరి మనసు దోచుకున్నాడు. ఆయన నటనతో తెలుగు వారిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు.
అంతేకాదు నిఖిల్ స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొనేవాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ రావడంతో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. తన మాట, ఆటతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు. నిఖిల్ కి మాత్రమే సీజన్ 8 విన్నర్ అయ్యే అర్హత ఉందని ప్రేక్షకుల అందరి నోట అనిపించుకున్నాడు. ఈ సీజన్ లో 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు.
ఇక పోతే నిఖిల్ లవ్ లైఫ్ విషయానికి వస్తే.. నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ చేసిన కావ్య శ్రీతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు. కానీ నిఖిల్ హౌస్ నుండి బయటికి వచ్చి రోజులు గడిచాయి కానీ తాను కావ్య శ్రీ కలవడానికి వెళ్లలేదు.
అయితే ఇదిలా ఉండగా ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ నీ గోల్ ఏంటి అని నిఖిల్ అడిగాడు.  నిఖిల్ మాట్లాడుతూ.. 'నేను సినిమా చేయాలి. నేను విలన్.. నాకు మంచి విలన్ రోల్ యే కావాలి. విలన్ రోల్ లో చాలా షేడ్స్ ఉంటాయి. నటనకు చాలా మంచి స్కోప్ ఉంటది. అందుకే నేను విలన్ గానే సినీ ఇండస్ట్రీలో ఎదగాలి అని అనుకుంటున్నా' అని నిఖిల్ చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: