- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో లెజెండ్ ప్రస్తావన అన్నది ఒక కాంట్రవర్సీ. ఎవరూ లెజెండ్ అనేది పెద్ద ప్రశ్న ? లెజెండ్ బిరుదు ఎవరికి ఇవ్వాలి ?  అనేది ఇండస్ట్రీ పెద్దగా ఎవరిని గుర్తించాలని చాలాకాలంగా ఉన్న ప్రశ్న. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవిని టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా లెజెండ్ గా గుర్తించాలని అనుకుంది. తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో దీనికి ప్లాన్ చేశారు. ఇండస్ట్రీ మొత్తం ఆయన సత్కరించాలని లెజెండ్ కిరీటం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే ఇది వివాదం అయింది. మోహన్ బాబు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. 500 పైగా సినిమాలు చేశాను .. విభిన్న పాత్రలు పోషించాను .. ఎన్నో సినిమాలు నిర్మించి ఉపాధి కల్పించాను... విద్యాసంస్థలు పెట్టి విద్యాదానం చేస్తున్నాను .. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ... రాజకీయాల్లో సేవ చేస్తున్నాను అంటూ మోహన్ బాబు ఆ వజ్రోత్సవ వేడుకల లోనే ఫైర్ అయ్యారు. తాను లెజెండ్ కాదా ? అంటూ ప్రశ్నించారు.


పరోక్షంగా చిరంజీవికి లెజెండ్ బిరుదు ఇవ్వాలనుకుంటున్న ఇండస్ట్రీ పెద్దలకు చురకలు అంటించారు. ఆ సంఘటనతో ఆ సత్కారానికి చిరంజీవి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఏఎన్ఆర్ జాతీయ అవార్డుల సమయం లో చిరంజీవి పరోక్షంగా ఆ ఘటనపై సెటైర్లు వేశారు. తనకు ఇప్పుడు సంతృప్తిగా ఉందని ఇప్పుడు తాను అర్హుడుగా భావిస్తున్నానని ఆ ఘటన గుర్తుకొచ్చేలా కామెంట్ చేశారు. ఇప్పుడు బాలయ్య ఈ విషయాన్ని తెరమీదకి తీసుకొచ్చారు. అంతేకాదు తనకు తాను లెజెండ్ అని ప్రకటించుకున్నారు బాలయ్య. ఆయ‌న హోస్ట్‌గా అన్‌స్టాప‌బుల్ షో నడుస్తున్న విషయం తెలిసిందే.


ఇందులో బాలకృష్ణ తాను లెజెండ్ అని వెల్లడించారు. లెజెండ్ కోసం మాట్లాడుకుంటున్నారు.. లెజెండ్ అంటే ఏంటి  ? ఎవరికి తెలుసు దాని అర్థం అందరూ ఎక్కడికి వెళ్ళినా లెజెండా లెజెండా అని పిలుస్తూ ఉంటారు.. అరె లెజెండ్ కాదు లెజెండ్ అని చెబుతుంటాను వాళ్లు కొట్టుకు చచ్చారు.. ఎవరు లెజెండ్ అని ? ఇన్ని సినిమాలు చేశా ... అన్ని సినిమాలు చేసేమని చెప్పుకుంటారు .. కానీ 50 ఏళ్లలో ఎన్ని పాత్రలు చేశాను ? విభిన్నమైన పాత్రలు చేశాను .... గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు ... ఫ్యాక్షన్ సినిమాలు ... పౌరాణిక ... జానపద సినిమాలు ... సైన్స్ ఫిక్షన్ మన మన అడుగు పెట్టని నేపథ్యం లేదు అలాంటి పాత్రలతో జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాను .. తెలుగు సినీ అభిమానులందరికీ .. ప్రేక్షకు దేవుళ్ళు అందరికీ లెజెండ్ అంటే ఏంటో నేను చెప్పక్కర్లేదు మీరే చెప్పారు అని వెల్లడించారు బాలయ్య. బాలయ్య చేసిన ఈ కామెంట్లు పరోక్షంగా చిరంజీవి - మోహన్ బాబుకు కౌంటర్లు వేసినట్టుగా ఉందన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: