ఇక ఇటీవల ఓ షోలో వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఆ షోకి శ్రీముఖి కి యాంకర్ అవ్వడంతో పలు విధాలుగా కావ్యని, నిఖిల్ ని కలపడానికి ప్రయతించినప్పటికి కావ్య, నిఖిల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిలిచిన నిఖిల్ మాలియక్కల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కావ్యకి తనతో ఉన్న రిలేషన్ గురించి అడిగితే.. వారిద్దరిది మంచి ఫ్రెండ్ షిప్ అని చెప్పాడు. చాలా మంది చాలా రకాలుగా తీసుకున్నారు కానీ కావ్య, తాను మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చాడు. షోలలో కనిపించింది అంతే అలా.. కానీ తాము ఏ రోజు లవర్స్ అని చెప్పికొలేదు అని అన్నాడు. ఇప్పుడు వారిద్దరూ వేరే వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారని నిఖిల్ తెలిపాడు. తాను బిగ్ బాస్ కి వెళ్లేది తనకన్నా ముందు కావ్యకి తెలుసు అని చెప్పాడు.
ఇక ఈ సీజన్ లో 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి నిఖిల్ గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు.