మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇతను తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ బంపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించింది  టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. 

ఈ సినిమాలో కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి చేసిన సాహసం ఏంటి అన్నది ఈ సినిమా కథ. దీపావళి కానుకగా రీసెంట్ గా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా సాలిడ్ రన్ ను కంటిన్యూ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. దుల్కర్ సల్మాన్ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమా లక్కీ భాస్కర్ కావడం విశేషం. 


దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాపై ఆర్థిక నిపుణులు కూడా స్పందించారు. ఈ దశాబ్దంలో వచ్చిన బెస్ట్ సినిమాస్ లో లక్కీ భాస్కర్ కూడా ఒకటని చెప్పారు. అలాగే ఈ సినిమాలో ఎన్నో జీవిత పాఠాలు ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే.... లక్కీ భాస్కర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వారం రోజుల క్రితం రిలీజ్ అయింది. 

ఇప్పుడు ఓటీటీలో లక్కీ భాస్కర్ సినిమా అరుదైన ఫీట్ అందుకుంది. పాన్ ఇండియా సినిమాలపైనే కల్కి 2898ఏడి, దేవర సినిమాలని వ్యూయర్షిప్ ని ఈ సినిమా బీట్ చేసింది. మొదటి వారంలోనే లక్కీ భాస్కర్ 11.7 మిలియన్ వ్యూస్ నీ సొంతం చేసుకుంది. కల్కి సినిమా మొదటి వారంలో 5.1, దేవర 8.6 మిలియన్ వ్యూస్ నీ మాత్రమే అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: