- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


మెగా ఫ్యామిలీలో ఇప్పటికే 10 మందికి పైగా హీరోలు వచ్చేసారు. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలను క్రికెట్ జట్టు టీం తో పోలుస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు .. అటు అల్లూ ఫ్యామిలీ హీరోలతో పాటు మెగా ఫ్యామిలీ అల్లుళ్ళు ... నాగబాబు కుమార్తె నిహారిక వీళ్ళందరూ కలుపుకుంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా 12 నుంచి 13 మంది నటీ నటులు ఇండస్ట్రీలో ఉన్నట్టు అయింది. వీళ్ళకి తోడు నాగబాబు కూడా అదనంగా కలుస్తారు. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ - పంజా వైష్ణ‌వ్ తేజ్ .. అటు అల్లు ఫ్యామిలీ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అల్లు శిరీష్ లాంటి ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కూడా మెగా ఫ్యామిలీ లో ఆడవాళ్లకు మరో హీరో సినిమాలు అంటే చాలా ఇష్టం అట.


ఈ విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజ‌ర్‌ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా చెప్పారు. ఆ హీరో ఎవరో కాదు ? నేచురల్ స్టార్ నాని. నాని గారు సినిమాలు చాలా బాగుంటాయి ... మా కుటుంబంలో వాళ్లకు .. మా అక్క‌ల‌కు నాని గారు నటించిన సినిమాలు ఉంటే చాలా ఇష్టం ... వాళ్లు నాని గారి సినిమాలను క్రమం తప్పకుండా చూస్తారని చెప్పారు ... మాకు మరో హీరో మీద ఈర్ష - అసూయ - ద్వేషం లాంటివి ఉండవు అని .. తమ కుటుంబం అందరి హీరోలను అభిమానిస్తుందని అందరికీ హీరోల సినిమాలు చూస్తుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: