సినిమా ఇండస్ట్రీ అంటే మేకప్ . అది హీరో నా..? హీరోయిన్ నా..? క్యారెక్టర్ ఆర్టిస్ట్ నా..? ఎవ్వరైన సరే మేకప్ కంపల్సరీ . కొందరైతే మేకప్ కంటిన్యూగా వేసుకుంటూనే ఉంటారు. మరి కొందరు మాత్రం కేవలం తమ సినిమా షూటింగ్ టైంలో మాత్రమే మేకప్ వేసుకొని మిగతా టైం లో నార్మల్ లుక్స్ లో కనిపించడానికి ఇష్టపడతారు. మరి కొంతమంది హీరోస్ అయితే అసలు మేకప్ వేసుకోమే వేసుకోమంటూ చెప్పుకొస్తూ ఉంటారు . కాగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం మేకప్ వేసుకోకుండా సినిమాలో నటించే దానికే ఇష్టపడతాడట .
అయితే కొన్ని కొన్ని సినిమాల విషయంలో మాత్రం అలా ఉండడం కుదరదు అని.. ఇష్టం లేకపోయినా మేకప్ వేసుకోవాలని అంటున్నారు జనాలు. మరి ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో మేకప్ వేసుకోకుండా నటించిన వన్ అండ్ ఓన్లీ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటున్నారు అభిమానులు . ఆ సినిమా మరేదో కాదు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన "చిరుత" మూవీ . ఈ సినిమా ద్వారానే తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ .
ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో దున్నేస్తున్నాడు. ఈ సినిమా టైంలో చరణ్ కి మేకప్ చేయడానికి చాలా ట్రై చేసాడట పూరీ జగన్నాథ్ . కానీ ఆయన క్యారెక్టర్ కి ఆయన మాస్ లుక్ కి మేకప్ లేకుండానే నటిస్తే బాగుంటుంది అని నేచురల్ అందం బయటపడుతుంది అని చిరంజీవి భావించారట . అదే విధంగా చిరంజీవి ఇష్టాన్ని గౌరవించాడట పూరీ జగన్నాథ్. ఏదో రెండు మూడు పాటలకి మినహా మిగతా చోట్ల అన్నీ కూడా మేకప్ లేకుండానే కనిపించాడు రామ్ చరణ్ . ఈ విషయం ఇప్పుడు మరొకసారి నెట్టింట బాగా వైరల్ గా మారింది.