మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలలో అంజి ఒకటి. ఫ్యాన్టసీ స్టోరీతో విజువల్ ఎఫెక్ట్స్ తో గ్రాండ్ గా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కోడి రామకృష్ణ. 2004లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, ప్రభాస్ వర్షం బరిలో దిగాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన అంజి ఫలితం పరంగా ఆ రెండింటికంటే వెనుకబడింది. ఈ చిత్ర ఫలితం ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. 2004 లో ఈ మూవీ వచ్చింది. ఆ టైంలో టెక్నాలజీ అంతంత మాత్రమే డెవలప్ అయ్యింది. ఆ రోజుల్లో కూడా దర్శకుడు కోడి రామకృష్ణ ఆ రేంజ్లో వి.ఎఫ్.ఎక్స్ ను డిజైన్ చేయడం అంటే మాటలు కాదు. అయితే ‘అంజి’ సినిమా ఆ టైంలో సక్సెస్ అందుకోలేదు.పైగా గ్రాఫిక్స్ వర్క్ కోసం 5 ఏళ్ళు కష్టపడి తీశారు.

షూటింగ్ చాలా సార్లు వాయిదా పడుతూ రావడం వల్ల సీన్ సీన్ కి కనెక్టివిటీ కూడా మిస్ అయ్యింది. అందుకే అంజి ఆ టైంలో సక్సెస్ కాలేదు. కానీ రిలీజ్ కి ముందు భారీ హైప్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ.అయితే టెక్నాలజీ లేని రోజుల్లోనే అడ్వాన్స్ కాన్సెప్ట్ తో దివంగత స్టార్ దర్శకులు కోడి రామకృష్ణ అంజి అనే సినిమాని రూపొందించారు. ఆ సినిమాలో గ్రాఫిక్స్ అత్యద్భుతంగా ఉంటాయి. క్లైమాక్స్ అయితే గూజ్ బంప్స్ తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ టైమ్ లో వచ్చి ఉంటే కచ్చితంగా అంజి పెద్ద హిట్ అయ్యి ఉండేది అనేది చాలా మంది నెటిజెన్ల అభిప్రాయం.ఒకవేళ ఆ సినిమా ఇప్పుడు కనుక రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా హనుమాన్ రేంజ్లో  సక్సెస్ అయ్యి ఉండేది అని అంతా భావిస్తున్నారు.

ఇక అంజి గురించి కోడిరామకృష్ణ మాట్లాడుతూ, చిరంజీవితో ఓ గ్రాఫిక్స్‌తో నిండిన తీయాలని నాకు శ్యాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. నేను చిరంజీవిని కలిసి సార్‌ గ్రాఫిక్స్‌ సినిమా అంటే కొత్త ఆర్టిస్టులాగా కష్టపడాల్సి వస్తుందని చెప్పాను. చిరంజీవి నో ప్రాబ్లమ్. కష్టపడటానికి నేను రెడీ. గ్రాఫిక్స్‌ చిత్రమే చేద్దామని అన్నారు ఈ ఇంటర్వెల్‌ సీన్స్‌ని నెలరోజుల తీశాం. చిరుగారు ఎంతో ఓపికగా చేశారు. సహకరించారు. నిర్మాత కూడా భారీగా ఖర్చుపెట్టినా చిత్రం ఐదేళ్ల తర్వాత విడుదలైంది. క్లైమాక్స్‌ సీన్స్‌ల కోసం చిరంజీవి ఒకే రంగు బట్టలు ధరించారు. గ్రాఫిక్స్‌కి ఇబ్బంది రాకూడదని ఆయన ఆ విధంగా సహకరించారు. ముందుగా చెప్పినట్లు ఓ కొత్త ఆర్టిస్ట్‌లానే కష్టపడ్డాడు. ఇంత పెద్దస్టార్ అయివుండి ఓ కొత్త హీరోయిన్‌తో చిరంజీవి చేయడం విశేషం. ఆ సినిమా పూర్తి కావడానికి చిరంజీవి గారే కారణం అని చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా అంజి సినిమాకు 2004 లో ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా చోటా కె. నాయుడు కి, అలాగే ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా చంద్రరావు గారికి నంది అవార్డ్స్ వరించాయి.ఏదేమైనా చిరంజీవి చేసిన సినిమాల్లో అంజి కి ప్రత్యేక స్థానం ఉంది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: