మహేష్ బాబుకి ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో..అంతకు డబల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముంబైలో నమ్రత కి ఉంది అన్న విషయం మనం మర్చిపోకూడదు . ముంబై బ్యూటీ .. అక్కడే పెరిగి సినిమాలో నటించి స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది . అయితే మహేష్ బాబును ప్రేమించి ఆయనపై ఉన్న ఇష్టంతో గౌరవంతో తనకు ఎంతో ఇష్టమైన సినిమాలను సైతం వదులుకుంది . స్టార్ హీరోయిన్ నమ్రత శొరోద్కర్.. ఇప్పుడు చాలా సింపుల్గా హోమ్లీ లుక్స్ లో మెరిసిపోతుంది . హౌస్ వైఫ్ గా ఉండడానికి నిర్ణయించుకుంది.
భర్త బాగోగులు పిల్లల ఆలనా పాలన అదేవిధంగా భర్త బిజినెస్ లు చూసుకుంటూ తన టైం మొత్తం గడిపేస్తుంది . నిజంగా నమ్రత శిరోద్కర్ లాంటి భార్య అందరికీ దొరకనే దొరకదు అంటూ చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు . కాగా మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఇంటర్వ్యూలు ఇచ్చేది చాలా తక్కువ . ఇచ్చిన ఇంటర్వ్యూలలోను ఓపెన్ గా అన్ని విషయాల గురించి మాట్లాడదు. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో నమ్రత శిరోద్కర్ బయటపెట్టిన నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నమ్రత ఫేవరెట్ తెలుగు హీరో మహేష్ బాబునే అది అందరికీ తెలుసు. అయితే మహేష్ బాబు కాకుండా తెలుగులో నమ్రత ఎక్కువగా చూసే స్టార్ హీరో సినిమాలు ఏవి..? ఆమె ఫేవరెట్ హీరో ఎవరు..? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే మహేష్ బాబు కాకుండా నమ్రత ఫేవరెట్ హీరో "చిరంజీవి" అంటూ తెలుస్తుంది . ఆయనతో కలిసి "అంజి" అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. కనైఇ వీళ్ళ కెమిస్ట్రీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి . అయితే మహేష్ బాబు తర్వాత అంతగా తెలుగు ఇండస్ట్రీలో నమ్రత ఇష్టపడే హీరో మాత్రం చిరంజీవి నేనట. ఆయన సినిమాలను మిస్ కాకుండా చూస్తుందట. ఇంకా ఎక్కువగా హిందీ సినిమాలనే లైక్ చేస్తూ ఉంటుందట. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ..షారుక్ ఖాన్.. హృతిక్ రోషన్ అంటే ఆమెకు చాలా చాలా ఇష్టమట..!