మెగా ఫ్యామిలీలోని వారసులంతా ఏదో రకంగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. మరి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ఎంట్రీ ఎప్పుడంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తారు. గతంలో నేడు , రేపు కథ సిద్ధమంటూ వార్తలు హల్‌చల్ చేసినా ప్రచారంగానే తేలిపోయింది.ఇదిలావుండగా సినిమాల్లో పవర్ స్టార్ గా పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి తెలియంది కాదు. ఆయన పేరు ఏ సినిమా ఫంక్షన్లో వినిపించినా విజిల్స్ పడాల్సిందే. అంతటి క్రేజ్ ఉన్న హీరో తనయుడి ఎంట్రీ అంటే సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అందరి ఎదురుచూపులు పవన్ తనయుడు అకీరా నందన్ తెరంగేట్రం పైనే.ఈ క్రమంలోనే తాజాగా అకీరాతో ఖుషి 2సినిమా చేయడంపై దర్శకుడు, నటుడు ఎస్‌ జే సూర్య రియాక్ట్ అయ్యాడు. పవన్‌ కళ్యాణ్‌తో ఆయన ఖుషి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇది సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోఇప్పుడు ఖుషి 2కి సంబంధించిన చర్చ స్టార్ట్ అయ్యింది.గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో ఎస్‌ జే సూర్య గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఖుషి 2 సినిమా అకీరా నందన్‌తో చేస్తారనే ప్రశ్న తలెత్తింది. దీనికి సూర్య రియాక్ట్ అవుతూ, ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు.

రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ లానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు.ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే టైం, కలిసి వస్తే,అది ఖుషి 2 జరుగుతుందేమో చూడాలి అనిచెప్పారు.అలాగే ఇదే ప్రశ్న అకీరా తల్లి రేణూదేశాయ్ కు ఎదురవుతూ ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన రేణూదేశాయ్ కి మరోసారి ఎదురైంది. అకీరా సినిమాల్లో రావాలని తల్లిగా అందరికంటే ఎక్కువగా చూస్తున్నా. నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే తాను అనుకున్నప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు. అప్పటివరకూ మనం వెయిట్ చేయాల్సిందే నని అన్నారు. ఇటివల పవన్ నటిస్తున్న ఓజీలో అకీరా ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వచ్చాయి. అవి నిజం కావని కూడా వార్తలు వచ్చాయి. మొత్తంగా అకీరా ప్రస్తుతం న్యూయార్క్ ఫిల్మ్ స్కూల్లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. మరోవైపు పియానోలో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: