బేబీ జాన్ మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ బాలీవుడ్ కి ఎందుకు వెళ్ళింది.. ఏ మొహం పెట్టుకొని వెళ్ళింది అంటూ ఆమెపై చాలామంది నేటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.మరి ఇంతకీ సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పై ట్రోలింగ్ జరగడానికి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. వరుణ్ ధావన్ హీరోగా చేసిన బేబీ జాన్ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేసింది.ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్ మొట్ట మొదటిసారి హిందీ సినిమాలో నటించింది.అయితే హీరోయిన్లు ఏ ఇండస్ట్రీలో అయినా నటించవచ్చు. కానీ కీర్తి సురేష్ పై మాత్రం హిందీ సినిమాలో నటిస్తే ట్రోలింగ్ జరుగుతుంది.ఇక ఈ ట్రోలింగ్ జరగడానికి ప్రధాన కారణం కీర్తి సురేష్ నటించిన ఓ సినిమానే.ఆ సినిమా ఏంటయ్యా అంటే రఘు తాత.. 

కీర్తి సురేష్ హీరోయిన్ గా చేసిన రఘు తాత సినిమా అందరూ చూసే ఉంటారు.ఈ సినిమాలో హిందీ భాషని బలవంతంగా నేర్పించే వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కీర్తి సురేష్. హిందీ భాషను ఎవరు కూడా బలవంతంగా నేర్పించడానికి హక్కు లేదని, బలవంతంగా ఎవరూ హిందీ భాష నేర్చుకోమని మనుషులపై రుద్దద్దు అంటూ ఒక మెసేజ్ ఇచ్చేలా ఈ సినిమా చేసింది.. అయితే ఈ సినిమాలో హిందీ భాష గురించి కాస్తా ఘాటుగానే ఉంటుంది. ఇష్టం లేకుండా హిందీ భాష నేర్చుకోవడం ఏంటి అన్నది ఉంటుంది. కానీ చివర్లో ఆమెనే హిందీ నేర్చుకొని ఎగ్జామ్ రాస్తుంది. ఇదంతా పక్కన పెడితే..ఈ సినిమాలో హిందీ భాషను వ్యతిరేకించే పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.

సినిమా చూసిన చాలామంది హిందీ ప్రేక్షకులు హిందీ భాషను వ్యతిరేకించిన నువ్వు హిందీ భాష లోకి ఏ మొహం పెట్టుకొని వచ్చావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు తమిళ జనాలు కూడా తనని ఘోరంగా తిడుతున్నారు అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. రఘు తాత సినిమాలో హిందీ భాషకు వ్యతిరేకంగా పోరాడినట్లు నటించిన నువ్వు ఆ వెంటనే హిందీ భాషలో బేబీ జాన్ మూవీ లో ఎలా నటించావు అంటూ నన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు అంటూ కీర్తి సురేష్ ఆ ఇంటర్వ్యూలో చెబుతూ బాధపడింది

మరింత సమాచారం తెలుసుకోండి: