తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి దిమ్రీ తన కెరియర్ స్టార్టింగ్ లో చాలా సమస్యలను ఎదుర్కొన్నానని పలు విషయాలను వెల్లడించింది.. తాను నటించిన లైలా మజ్ను సినిమా వరకు తనకు నటన గురించి అంతంత మాత్రమే తెలుసని అందుకే షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట. ఒక్కొక్కసారి తాను ఈ ఫీల్డ్ లోకి వచ్చి తప్పు చేశానేమో అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయట .దీనివల్ల సెట్ లో భాష అర్థం కాక చాలా సార్లు ఇంటికి వెళ్లి ఏడ్చాను అంటూ తెలిపింది త్రిప్తి దిమ్రీ.
ఒకసారి వర్క్ షాప్ కి లేటుగా వెళ్లినందుకు తనను తిరిగి పంపించేసారని తెలియజేసింది. అప్పుడే ఇండస్ట్రీలో వర్క్ తో పాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని తెలిసిందని తెలిపింది. మనం అనుకున్నంత సులువుగా నటన అంటే రాదు అని ఈ ప్రపంచంలో ఎన్నో సవాల్ లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం త్రిప్తి దిమ్రీ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి తన నటనతో ఆడియన్స్ తో అందరినీ ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రీ తెలుగులో కూడా నటించేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.