గేమ్ చెంజర్ సినిమాను తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా అనంతరం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా చూస్తున్నారు. కాగా గేమ్ చేంజర్ ప్రచార కార్యక్రమాలలో హీరోయిన్ కియారా అద్వానీ ఇంతవరకు ఎక్కడా కూడా కనిపించలేదు.
అమెరికాలో నిర్వహించిన ఈవెంట్ లో కూడా కియారా అద్వానీ పాల్గొనలేదు. రీసెంట్ గా రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను కియారా అద్వానీ పాల్గొనలేదు. మరి కియారా అద్వానీ ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నలు చాలానే వస్తున్నాయి. కియారా అద్వానీ రావడం లేదా? లేదంటే మేకర్స్ కియారా అద్వానీని ప్రచార కార్యక్రమాలకు పిలవడం లేదా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కియారాని తన పనులు తాను చూసుకోమని మేకర్స్ చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.
సాధారణంగా ఓ స్టార్ హీరో సరసన హీరోయిన్ గా నటించిందంటే రిలీజ్ వరకు అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలి. కానీ దిల్ రాజు ఆమెను కొంతకాలం పాటు పక్కన ఉండమని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. తమ అభిమాన హీరోకి సంబంధించిన పోస్టర్లు, భారీ కట్ అవుట్ లను థియేటర్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.