జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నిల్ కలయికలో వస్తున్న సినిమా కూడా షూటింగ్ మొదలు కాబోతోందట.. అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో నిర్మిస్తూ ఉన్నారు. ఈనెల మూడో వారంలో కర్ణాటకలో మొదటి షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెట్లో ఎన్టీఆర్ వచ్చే నెలలో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నిల్.
ఎన్టీఆర్కు జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2026 జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. మరి ఈ విషయం పైన అఫీషియల్ గా చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. అలాగే డైరెక్టర్ కొరటా శివతో దేవర 2 సినిమా చేయడానికి కూడా మరికొన్ని నెలలు సమయం పడుతుంది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి వచ్చే యేడాదికి ఏఏ సినిమాలతో అభిమానులను జూనియర్ ఎన్టీఆర్ మెప్పిస్తారేమో చూడాలి మరి. మొత్తానికి ఈ విషయంతో మరొకసారి ఎన్టీఆర్ పేరు వైరల్ గా మారుతున్నది.