అయితే పుష్ప 2 సినిమా తర్వాత రష్మిక మందన్నా ఖాతాలో బిగ్ బిగ్ బడా సినిమాలే ఉన్నాయి . మరి ముఖ్యంగా "అనిమల్ పార్క్" సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది రష్మిక అంటూ చాలామంది జనాలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండింగ్ గా మారింది. రష్మిక మందన్నా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు జనాలు సినీ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. ఇక పై చిన్న హీరోలతో సినిమా చేయదట . ఆమె పాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీ సంపాదించుకున్నాక చిన్న హీరోలతో సినిమా చేసినా.. గెస్ట్ పాత్రలో మెరిసిన.. ఆమె క్రేజ్ డమాల్ అంటూ పడిపోతుంది అంటూ భయపడిపోతుందట.
ఆ కారణంగానే బాలీవుడ్ కాదు .. కోలీవుడ్ కాదు.. టాలీవుడ్ కాదు ఏ ఇండస్ట్రీ అయినా సరే స్టార్ హీరోలతోనే సినిమాలో నటించాలి..చిన్న పత్రల్లో కనిపించకూడదు అంటూ స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకుందట . ఇదే న్యూస్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఒకవేళ అదే నిజమైతే మాత్రం రష్మిక కెరియర్ చిక్కుల్లో పడిన్నట్లే అంటున్నారు సినీ ప్రముఖులు . చిన్న పెద్ద అని తేడా లేకుండా నటిస్తేనే ఇండస్ట్రీలో లైఫ్ ఉంటుంది అని ..పాన్ ఇండియా సినిమాలే కావాలి అంటే మాత్రం ఆమె కెరియర్ చిక్కుల్లో ఇరుక్కున్నట్టే అంటూ చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి రష్మిక తన డిసిషన్ మార్చుకుంటుందో ఏమో..?