అయితే ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా..? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చి రెండేళ్లు పైనే అవుతుంది . కానీ సినిమాకి సంబంధించిన ఒక్క విషయం కూడా బయటకు రావడం లేదు . దీంతో జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ప్రశాంత్ నీల్ కి వార్నింగ్ ఇచ్చారట . "నువ్వు ఎంత టైం అయినా తీసుకో పర్వాలేదు .. కానీ సినిమా మాత్రం మా ఫ్యాన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేయాలి. సినిమా కోసం ఏమైనా చేద్దాం .. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవ్వాలి..'ఆదీ నాటి రోజులు గుర్తు చేసుకోవాలి "అంటూ చెప్పుకొచ్చారట .
దీంతో ప్రశాంత్ నీల్ సైతం సరదాగా నవ్వేసారట . అంతేకాదు ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఫ్రెండ్షిప్ చాలా చాలా స్ట్రాంగ్ . వీళ్ళ ఫ్యామిలీస్ కూడా మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తున్నాయి . సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కలిసి దిగిన ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . కాగా ప్రశాంత్ నీల్ - ప్రభాస్ తో సలార్2 కూడా తెరకెక్కించాల్సి ఉంది . అదే విధంగా మరొక బిగ్ బడా స్టార్ అయిన రామ్ చరణ్ తోనూ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్స్ సినిమాలను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ఏ నీల్ విధంగా ఆ హీరోస్ ని డిఫరెంట్ గా చూపిస్తాడు అనేది ఇప్పుడు హైలైట్ గా చర్చించుకుంటున్నారు అభిమానులు..!