"2025లో మాకు ఒక బాబు కావాలి" అంటూ సురేఖ అదే విధంగా చిరు అమ్మగారు అంజనమ్మ ఆ లెటర్లో రాసి ఉంటారు . దీంతో చరణ్ కూడా నవ్వుకొని షాక్ అయిపోతాడు. ఇదంతా చాలా సరదాగా జరిగింది .కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనిపై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది . "ఎంత పెద్ద స్టార్ అయినా సరే కొన్ని కొన్ని విషయాలలో తలనొప్పులు ఫేస్ చేయక తప్పదు. ప్రతి ఇంట్లో ఉండే సమస్య నే ఇది. పెళ్లి పెళ్లి అంటారు.. పెళ్లి చేసుకున్నప్పుడు నుంచి పిల్లలు ఎప్పుడూ అని ఒక టార్చర్.. ఒక బిడ్డ పుట్టాక పాప అయితే నెక్స్ట్ బాబు అని.. ముందు బాబు అయితే నెక్స్ట్ పాప అని ఏదో ఒక రకంగా ఇంకొక బిడ్డని కనిచ్చే వరకు ఈ పెద్ద వాళ్ళు సైలెంట్ గా ఉండరు" అంటూ యంగ్ స్టర్స్ కామెంట్స్ పెడుతున్నారు .
అంతేకాదు ఇప్పుడు రామ్ చరణ్ కి కొడుకు పుట్టడం చాలా చాలా అవసరం . మెగా ఫ్యామిలీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే కచ్చితంగా రాంచరణ్ కి కొడుకే పుట్టాలి . ఆ కారణంగానే సురేఖ మాకు బాబు కావాలి అంటూ ఆ లెటర్లో రాసి మరి పంపించింది అంటున్నారు జనాలు. కాగా క్లీం కార గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రామ్ చరణ్. చాలా చాలా ఎమోషనల్ గా స్పందించారు . "ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో.. అప్పుడు జనాలకి ఆమె ఫోటో రివీల్ చేస్తాను" అంటూ కూడా చెప్పుకొచ్చాడు . దీంతో మెగా ఫాన్స్ ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు..!