గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరంలో అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  సినిమా టికెట్ల రేట్ల పెంపు, రాజకీయ అంశాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేతత్వం రామ్‌చరణ్‌ది అని అన్నారు పవన్ కళ్యాణ్. అన్నయ్య చిరంజీవి తనకు తండ్రి లాంటివారని, చరణ్ తనకు తమ్ముడి లాంటివాడన్నారు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడినని అన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన రామ్‌చరణ్‌ బంగారమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏడేళ్ల వయస్సులోనే రామ్‌చరణ్‌ హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడని పవన్ చెప్పారు. ఇంత ప్రతిభ, సమర్థత ఉందని, ఎవరికీ తెలియదన్నారు. సుకుమార్ తీసిని రంగస్థలంలో రామ్‌చరణ్‌ నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందనుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తప్పకుండా రావాలన్నారు. చిరంజీవి వారసుడు అలా కాకపోతే ఎలా ఉంటాడు. తండ్రి మెగాస్టార్ అయితే.. కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడని అన్నారు పవన్.ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో రామ్ చరణ్ కి జాతీయ అవార్డ్ రావాలనే డిమాండ్ పెరుగుతోంది.

అతడు నటించిన రంగస్థలం చిత్రంలో అత్యుత్తమ నట ప్రదర్శన ఇచ్చాడని, కానీ జాతీయ అవార్డుల కమిటీ, జూరీ పట్టించుకోలేదని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది.చరణ్ కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ దక్కుతుందని పవన్ బలంగా నమ్మారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులు, తెలుగు సినిమాపై చిన్న చూపు కారణంగా ఆశించినది రాలేదు.చరణ్ పెరిగింది చెన్నై, హైదరాబాద్ లాంటి చోట. కానీ అతడు రంగస్థలం చిత్రంలో గోదారి కుర్రాడిగా ఎంతో ఒదిగిపోయి నటించాడు. అసలు రాజమండ్రి పరిసరాలతో అతడికి ఎలాంటి సంబంధం లేకపోయినా పాత్రను వోన్ చేసుకుని అద్బుతంగా నటించాడని పవన్ ప్రశంసించారు. పుష్ప 2021 చిత్రంలో నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. నెక్ట్స్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ చిత్రంతో ఈ ఫీట్ సాధించాలని, జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకోవాలని మెగాభిమానులు కోరుకుంటున్నారు.గేమ్ చేంజర్ తో మెగా అభిమానుల్లో వున్నా జాతీయ అవార్డు లోటుని రాంచరణ్ తీరుస్తాడో లేదో చూడాలి.ఈ క్రమంలోనే శంకర్ సినిమాతో చరణ్‌కి అవార్డ్ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: