ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ వైద్య సదుపాయానికి అవసరమైన డబ్బులను అల్లు అర్జున్ అందజేస్తున్నాడు. కాగా, రేవతి మరణం కారణంగా అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చాడు. అల్లు అర్జున్ బెయిల్ విషయం మీద ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు.
పుష్ప-2 సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది పుష్ప-2 సినిమా పాటలపై రీల్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ అన్నింటికన్నా ఎక్కువ హైలైట్ అయింది. పుష్ప-2 సినిమా బాహుబలి-2 సినిమా రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి జాతర ఎపిసోడ్ ను పెట్టి రీల్ చేశాడు.
అందులో బాహుబలిని దాటుకుంటూ పుష్పరాజ్ ఎగిరినట్లు ఆ మీమ్ క్రియేట్ చేశాడు. ఆ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ మీమ్ కాస్త అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది. ఆది చూసిన బన్నీ దానిని లైక్ చేశాడు. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివే తగ్గించుకుంటే చాలా మంచిది అంటూ సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నావు ఇలాంటివి చేయడం మానుకో అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.